Share News

దుబాయ్‌లో చిక్కుకున్న వారిని తీసుకురండి

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:55 PM

ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ చిక్కుకున్న కుటుంబ సభ్యులను తీసుకువచ్చేం దుకు కృషి చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడు కున్నారు.

దుబాయ్‌లో చిక్కుకున్న వారిని తీసుకురండి
బాధితులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ చిక్కుకున్న కుటుంబ సభ్యులను తీసుకువచ్చేం దుకు కృషి చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడు కున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ను గురువారం రామయ్యపుట్టుగలో కలిసి విన్నవిం చారు. ఆరునెలల కిందట స్థానికంగా ఉపాధి లేక కుటుంబాల పోషణ కోసం స్థానికంగా ఉన్న ఏజెంటు ద్వారా కవిటి గ్రామా నికి చెందిన పొల్లాయి చిరంజీవి, సన్నిధి కోదండస్వామి దుబాయ్‌ వెళ్లారని, అయితే అక్కడ మూడు నెలలుగా తిండి లేక బాధపడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆరు నెలల కిందట ఏజెంటు ద్వారా దుబాయ్‌లోని సిల్సిలా గ్రూప్‌ లో పనులు చేసేం దుకు వెళ్లారని, అయితే మూడు నెలలు పనులు సక్రమంగా చేసిన తరువాత సమస్య ఏర్పడిం దన్నారు. గత మూడు నెల లుగా వేతనాలు ఇవ్వడం లేదని, తమను బంధించారని బాధితులు మా దృష్టికి తీసుకు వచ్చా రని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. ఎమ్మెల్యే బి.అశోక్‌ వెంట నే బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలి యజేస్తే స్వదేశానికి తీసు కువచ్చేందుకు ప్రయత్ని స్తానని భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 04 , 2025 | 11:55 PM