జాతీయ సమైక్యత శిబిరానికి బీఆర్‌ఏయూ విద్యార్థులు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:33 PM
హర్యానా రాష్ట్రం రోహతక్ పట్టణం లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం పయనమయ్యారు.
ఎచ్చెర్ల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): హర్యానా రాష్ట్రం రోహతక్ పట్టణం లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం పయనమయ్యారు. మంగళవారం నుంచి 7 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో వివిధ రాష్ట్రాల సంస్కృతి, కళలు, క్రీడలు, అభిరుచులు తదితర అంశాలపై పరస్పర భాగస్వా మ్యం చేయనున్నారు. వర్సిటీలోని కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విద్యా ర్థులు ఎన్.త్రివేణి, కె.పవన్, జి.రవి, జి.శ్రావణి, ఎస్.సాయి ప్రదీప్, ఎస్. భార్గవి (ఈసీఈ), జి.చంద్రశేఖర్, పి.అభిషేక్ (ఈఈఈ), ఎస్.అంకిత (కంప్యూటర్స్), ఎం.పవిత్ర (ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల) ఈ శిబిరంలో పాల్గొంటు న్నారు. ఈ బృందానికి వర్సిటీ ఎన్ ఎస్‌ఎస్ పీవో డాక్టర్ కె.కరుణానిధి నాయకత్వం వహిస్తున్నారు. జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొనేందుకు బయలు దేరిన విద్యార్థులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.వనజ అభినందించారు.