Share News

నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:12 AM

మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనా సమయం హరించుకుపోతున్న తరుణంలో ఉపాధ్యాయులంతా శుక్రవారం నుంచి బోధనేతర పనులు బహిష్కరించడం జరుగుతుందని ఫ్యాప్టో ఆద్వర్యంలో ఉపాధ్యాయులు ఎంఈవోకు వినత పత్రంను అందజేశారు.

నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ

నరసన్నపేట, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనా సమయం హరించుకుపోతున్న తరుణంలో ఉపాధ్యాయులంతా శుక్రవారం నుంచి బోధనేతర పనులు బహిష్కరించడం జరుగుతుందని ఫ్యాప్టో ఆద్వర్యంలో ఉపాధ్యాయులు ఎంఈవోకు వినత పత్రంను అందజేశారు. గురువారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. కార్యాక్రమంలో యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, ఎస్‌టీయూ, డీటీఎఫ్‌, హెచ్‌ఎం, అప్టా, పీఈటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నందిగాం: పాఠశాలలో విద్యాబోధనలో అడ్డంకిగా ఉన్న యాప్‌లను శుక్రవారం నుంచి బహిష్కరిస్తామని ఫ్యాప్టో ఆఽధ్వ ర్యంలో ఎంఈవో జి.నర్సింహులు వినతి పత్రాన్ని గురువారం ఉపాధ్యాయులు అంద జేశా రు. ఫ్యాప్టో ప్రతినిధులు బి.శంకరరావు, కృష్ణా రావు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

గుజరాతీపేట: ఉపాధ్యాయ విధులు, విద్యా ర్థుల మధ్యాహ్న భోజన పథక నిర్వహణ తప్ప బోధనేతర కార్యక్ర మాలను శుక్రవారం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో చైర్మన్‌ బి.శ్రీరా మ్మూర్తి, కార్యదర్శి పి.ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఈవో రవిబాబులకు మెమొరాండంలు ఇచ్చామన్నారు. ఇప్పటికే బోధనేతర కార్యక్రమాల వల్ల విద్యార్థు లకు నాణ్యమైన బోధన అందక, సమయం చాలక విద్యార్థుల అభ్యసన కుంటుపడుతోందన్నారు. ప్ర భుత్వం దృష్టికి అనేకమార్లు సమస్యలను తీసుకు వెళ్లినప్పటికీ పట్టించు కోకపోవడంతో బహిష్క రిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో సభ్యులు బి.రవికుమార్‌, బి.వెంకటేశ్వర్లు, వి.సత్యనారాయణ, జి.రమణ పాల్గొన్నారు.

కవిటి: ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యా యులంతా శుక్రవారం నుంచి యాప్‌లను బహిష్క రించి కేవలం బోధనకే పరిమితమవుతారని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. గురువారం ఎ మ్మార్సీ వద్ద ఎంఈవో ధనుంజయకి వినతిపత్రం అందించారు. పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:12 AM