విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:34 AM
గొప్పిలి గ్రామానికి చెందిన నౌగాపు మహేష్(11) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు.
మెళియాపుట్టి, జూలై 10(ఆంధ్రజ్యోతి): గొప్పిలి గ్రామానికి చెందిన నౌగాపు మహేష్(11) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. ఇంటిమేడపై ఆడుకుం టూ సబ్‌స్టేషన్ నుంచి వస్తున్న 11కేవీ విద్యుత్ వైరు పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ స్థానిక ప్రాథమిక పాఠశాల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. నాలుగు నెలలు కిందటే తండ్రి నౌగాపు చంద్రరావు మృతి చెందగా.. తల్లి లక్ష్మి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. మహేష్‌కి మూడో తరగతి చదువుతున్న చెల్లెలు వర్షిణి ఉంది.