కాలువలో పడి బాలుడి మృతి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:27 AM
బందరువానిపేటకు చెందిన గంగాడ అప్పలరాజు(12) వంశధార కాలువలో పడి మృతి చెందాడు.
గార, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): బందరువానిపేటకు చెందిన గంగాడ అప్పలరాజు(12) వంశధార కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం అప్పలరాజు బహర్భూమికని సమీపంలోని కాలువకు వెళ్లాడు. అయి తే ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గ్రామ సమీపంలో గల వంశధార నదిలో అప్పలరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పలరాజు కొన్నాళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్ వచ్చి ప్రమాదశాత్తు జారిపడి నీటిలో ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. బాలుడి తండ్రి లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. లక్ష్మణరావుకు ముగ్గురు కుమారుల్లో అప్పలరాజు రెండోవాడు. 8వ తరగతి చదువుతున్నాడు.