జోరందుకున్న సారా విక్రయాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:48 AM
సంక్రాంతి అమ్మకాలకు నాటుసారా సిద్ధం చేస్తున్నారు. ప లాస మండలం పెద్దంచల గ్రామ శివారులోని ఓ తోటలో నాటుసారా తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీ డియాలో వైరల్‌గా మారింది.
పలాస, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి అమ్మకాలకు నాటుసారా సిద్ధం చేస్తున్నారు. ప లాస మండలం పెద్దంచల గ్రామ శివారులోని ఓ తోటలో నాటుసారా తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీ డియాలో వైరల్‌గా మారింది. ఎక్సై జ్‌శాఖ ఉదారత ఆసరాగా చేసుకు ని ఇష్టారాజ్యంగా నాటుసారా గ్రా మాల్లోకి వస్తోంది. పలాస-కాశీబు గ్గ మున్సిపాలిటిలో పెంటిభద్ర గ్రా మంలో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శాసనం, పురుషో త్తపురం, గొప్పిలి, రెంటికోట, లొ త్తూరు పరిసరాల్లో కూడా నాటు అమ్మకాలు జోరందుకున్నాయి. ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని చూసిచూనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెదంచల గ్రామ సమీపంలో ఉన్న కొండ సరిహద్దుల్లో నాటు తయారీతో పాటు ప్యాకింగ్ చేసి గ్రామాల్లోకి తరలిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చావయినా, పుట్టుగయినా, పంట కోతలయినా ఇలా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సారా ప్యాకెట్లు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
సారా అమ్మకందారుల అరెస్టు
పెదంచల గ్రామానికి చెందిన మోహనరావు, ఆయన అల్లుడు శ్రీరామ్‌లను ఆదివారం అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు తెలిపారు. నాటుసారా ఒడిశాలో కొనుగోలు చేసుకొని ప్యాకెట్లు కట్టి అమ్మకానికి తీసుకు వస్తుండగా ఎస్‌ఐ ఆర్.నర్సింహమూర్తి, పోలీసుల బృందం వారిని రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. వీరిని పలాస కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. ఉదయం వీరిద్దరు నాటుసారా అమ్మకం చేయడానికి ప్యాకెట్టు కడుతున్నట్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే.