Share News

ముగిసిన పుస్తక మహోత్సవం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:37 PM

నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో పదిరోజులుగా జరుగుతున్న పుస్తక మహోత్సవం గురువారంతో ముగిసింది. చివరి రోజు సాహిత్య, బైఙ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంగణం కళకళలాడింది.

ముగిసిన పుస్తక మహోత్సవం
వివిధ పోటీల విజేతలతో నిర్వాహకులు

పాత శ్రీకాకుళం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో పదిరోజులుగా జరుగుతున్న పుస్తక మహోత్సవం గురువారంతో ముగిసింది. చివరి రోజు సాహిత్య, బైఙ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంగణం కళకళలాడింది. సుమారు 20వేల మంది పుస్తక మహోత్సవాన్ని సందర్శంచగా సుమారు రూ.15 లక్షల విలువ చేసే పుస్తకాలు విక్రయిం చినట్లు నిర్వాహకులు తెలిపారు. కాళీపట్నం రామారావు సాహిత్య వేదికపై ‘కళింగాంధ్ర యాస-భాషపై చర్చ వేదిక నిర్వహించారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న మాట్లాడుతూ.. తెలుగు భాషాభి వృద్ధికి గిడుగు రామ్మూర్తిపంతులు ఆద్యుడని, ఆధునిక భాషా వికాసానికి గురజాడ అప్పారావు కీలకంగా కృషి చేశా రన్నారు. ఎల్‌.ఎన్‌ కొల్లి రచించిన ‘ఎకోస్‌-ఎంబర్స్‌’, పత్తి సుమతి రచించిన ‘డౌన్‌ డౌన్‌ డార్విన్‌’ ఆటపుస్తకాన్ని, మొయిద శ్రీనివాసరావు రాసిన కరవాక పుస్తకాన్ని ఆవిష్క రించారు. అనంతరం షణ్ముఖరావు ఆధ్వర్యంలో బ్రహ్మ సమా జ స్కిట్‌ డ్రగ్స్‌ వద్దు బ్రో అంశంపై ఒగ్గుకథ ఆలోచింప జేసింది. హేమ సూదన్‌ బృందం డప్పు వాయిద్యం ప్రేక్షకు లను ఉత్సాహపరిచింది. జేవీవీ ఆధ్వర్యంలో వైజ్ఞానిక కార్య క్రమాలు నిర్వహించారు.

Updated Date - Nov 20 , 2025 | 11:37 PM