Irok : 35 రోజుల తర్వాత..
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:40 PM
35 Days Delay కవిటి మండలం బెలగాం గ్రామానికి చెందిన వలసకూలీ టి.భుజంగరావు(45) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం స్వగ్రామానికి చేరింది. భుజంగరావు కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు. మార్చి 6న అక్కడ కంపెనీలోని ప్రమాదంలో మృతి చెందాడు.

ఇరాక్ నుంచి స్వగ్రామానికి వలస కూలీ మృతదేహం
కవిటి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కవిటి మండలం బెలగాం గ్రామానికి చెందిన వలసకూలీ టి.భుజంగరావు(45) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం స్వగ్రామానికి చేరింది. భుజంగరావు కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు. మార్చి 6న అక్కడ కంపెనీలోని ప్రమాదంలో మృతి చెందాడు. భుజంగరావును చివరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. స్థానిక నేతల సహాయంతో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను కలిసి ఇరాక్ నుంచి భుజంగరావు మృతదేహాన్ని తీసుకువచ్చేలా చూడాలని వేడుకున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దృష్టికి విప్ అశోక్ ఈ సమాచారాన్ని అందించి మృతదేహాన్ని తీసుకువచ్చేలా కృషిచేశారు. దాదాపు 35రోజుల తర్వాత శుక్రవారం భుజంగరావు మృతదేహం చేరుకుంది. దీంతో ఆ మృతదేహాన్ని చూసి తల్లి దమయంతి, భార్య జయలక్ష్మి, కుమార్తెలు దీక్ష,రిషి బోరున విలపించారు. ఇరాక్ నుంచి మృతదేహాన్ని తెప్పించేందుకు కృషిచేసిన కేంద్రమంత్రి, విప్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.