తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:41 PM
జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్‌క్రాస్ భవనంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
అరసవల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్‌క్రాస్ భవనంలో మంగళ వారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 30 మండ లాల నుంచి వచ్చిన 180 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశా రు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహనరావు మాట్లా డుతూ.. రక్తదానం చేయడం ద్వారా తలసేమియా, సికెల్ సెల్ అనీమి యాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రాణదానం చేసినట్లయిం దన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి పీడీ బి.లవరాజ్, ఏవో నాగేశ్వరరావు, హరిత, రెడ్‌క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్యకుమార్, జి.రమణ, నరసింహారావు, గుణాకరరావు పాల్గొన్నారు.