DGP meet: డీజీపీ దృష్టికి బ్లాక్‌మెయిల్ బాగోతం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:55 PM
Police Investigation పలాసలో ఇటీవల జరుగుతున్న బ్లాక్‌మెయిల్ బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష.. డీజీపీ హరీష్‌గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. గురువారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిశారు.
లబ్ధి పొందేందుకు కుట్రలు
ఆధారాలతో వివరించిన పలాస ఎమ్మెల్యే శిరీష
పలాస రూరల్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): పలాసలో ఇటీవల జరుగుతున్న బ్లాక్‌మెయిల్ బాగోతాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష.. డీజీపీ హరీష్‌గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. గురువారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిశారు. ‘పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆసరాగా చేసుకొని కొంతమంది లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారు. పలు శాఖల అధికారులను బెదిరిస్తూ ఆర్థిక ప్రయోజనం పొందాలని కుయుక్తులు పన్నుతున్నార’ని ఎమ్మెల్యే శిరీష వివరిస్తూ పలు ఆధారాలను సమర్పించారు. బ్లాక్‌మెయిల్‌కు లొంగని వారిపై పలు శాఖల అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జాబితాను, ఇప్పటివరకూ వారు చేసిన అక్రమాల వివరాలను అందజేశారు. దీనిపై డీజీపీ సానుకూలంగి స్పందిస్తూ.. తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీషకు హామీనిచ్చారు.