Biogas plants: ఉమ్మడి జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:49 PM
Biogas plants Environmental protection ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు జిల్లాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం
శ్రీకాకుళం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో పలు జిల్లాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండు ప్రాంతాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చేసిన అభ్యర్థనను మంత్రి మండలి ఆమోదించింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సంతవురిటిలో 15 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ రెండు ప్లాంట్లను, వంగర మండలం అరసాడలో 20 టీఈడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఇటీవల పీవీఎస్ గ్రూప్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనికి మంత్రి మండలి ఆమోదించింది. సుమారు రూ.200 కోట్లతో రెండు ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్‌లు కొద్దినెలలో ఏర్పాటు కానున్నాయి. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు.