స్ఫూర్తి ప్రదాత భగత్‌సింగ్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:31 PM
భారత స్వా తంత్ర్యోద్యమ విప్లవజ్వాల భగత్ సింగ్ అని, ప్రతి ఒక్క రూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు.
అరసవల్లి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): భారత స్వా తంత్ర్యోద్యమ విప్లవజ్వాల భగత్ సింగ్ అని, ప్రతి ఒక్క రూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం, స్మృతి వనంలో సర్దార్ భగత్‌సింగ్ జయంతిని ఆదివారం నిర్వ హించారు. భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్‌సింగ్ దేశభక్తి యువతకు ఎప్పటికీ ఆదర్శప్రాయ మన్నారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జామి బీమ శంకర్, వేదవతి, శ్యాంప్రసాద్, కొంక్యాన వేణుగోపాల్, వావిలపల్లి జగన్నాథం నాయుడు, మహిబుల్లాఖాన్, పైడి హరనాథరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భగత్ సింగ్ జయంతి
రణస్థలం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్‌సింగ్ జయంతిని ఆది వారం నారువా గ్రామంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ నిద్రబంగి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పలువురు రైతులకు తువ్వాళ్లను పంపిణీ చేశారు. పలువురు స్థానికులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
పాతపట్నం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): భగత్‌సింగ్ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక ఆలాంధ్ర రోడ్ లోని ఆదర్శ పాఠశాలలో భగత్‌సింగ్ జయంతి హెచ్‌ఎం పి.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ విగ్రహానికి జాతీయ జెండా రంగులతో కూడిన నూలు పోగులేసి నివాళులర్పించారు. రిటైర్డు ఎంఈవో బి.సింహాచలం, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.