మెరుగైన వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:56 PM
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు.
జి.సిగడాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిం చాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సాయంతో ఆధునికీ కరిం చిన బాతువ పీహెచ్‌సీని బుధవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు నాణ్య మైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీ ల ఆధునికీకరణ చేపట్టేందుకు డా.రెడ్డీస్ ముందుకు రావడం అభినంద నీయమన్నారు. ఫౌండేషన్ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 18 పీహెచ్‌సీలను ఆధునికీకరించామని, మరో 6 పీహెచ్‌ల్లో పనులు చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు బి.అనూ ష, ప్రతిష్ఠాశర్మ, ఆసుపత్రి, ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.