Share News

ఉత్తమ సేవలు అందించాలి: మామిడి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:51 PM

ఉత్తమ సేవలందించి ప్ర భుత్వ రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

ఉత్తమ సేవలు అందించాలి: మామిడి
పదోన్నతి పొందిన అంగన్‌వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం/రూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉత్తమ సేవలందించి ప్ర భుత్వ రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక ఓ కల్యాణ మండలంలో ఐసీడీఎస్‌ శాఖ పరిధిలోని మినీ అంగన్‌వాడీల నుంచి మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి పొందిన వారికి నియామక ఉ త్తర్వులు శనివారం ఎమ్మెల్యే అందజేశారు. తొలుత కేక్‌ కటింగ్‌ చేసి కేకుల పం చిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ.. రూ.400 జీతం పొందిన నాటి నుంచి నేటివరకూ మాసేవలను గుర్తిస్తూ జీతా ల పెంపుతోపాటు ప్రతీ డిమాండ్‌ తీర్చింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఆ యన రుణం తీర్చుకోలేనిదన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడు తూ.. అంగన్‌వాడీ కార్యకర్తలంతా సమయపాలన పాటిస్తూ ఉత్తమ సేవలం దించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పాతపట్నం ఐసీడీఎస్‌ పరిధిలోని 42మంది మినీ అంగనవాడీ కార్యకర్తలకు పదోన్నతి పొందారన్నారు. ఐసీడీఎస్‌ పీవో సీహెచ్‌ ఇందిర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూట మి నాయకులు సలాన మోహనరావు, పైల బాబ్జీ, సైలాడ సతీష్‌, తూలుగు తిరుపతిరావు, పాతపట్నం మెళియాపుట్టి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధి కారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:51 PM