సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:32 AM
‘కాలం చాలా వేగంగా మారిపోతోంది. ప్రతీ జిల్లా అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాల సాధన సాధ్య మవుతుంది.’ అని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ అన్నా రు.
గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 31(ఆంధ్రజ్యోతి): ‘కాలం చాలా వేగంగా మారిపోతోంది. ప్రతీ జిల్లా అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాల సాధన సాధ్య మవుతుంది.’ అని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ అన్నా రు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తలసరి ఆదాయం, జీడీపీ వంటి కీలక సూచీలలో శ్రీకాకుళం జిల్లా గణనీయంగా పురోగతి సాధిస్తోందని వెల్లడించారు. ముఖ్య మంత్రి కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ తరువాత ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందన్నా రు. పింఛన్ల పంపిణీలో ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నామని, డోర్ టు డోర్ సేవలతో ఈ వ్యవస్థ మరింత సమర్థవం తంగా అమలవుతోందని తెలిపారు. జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ముం దస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగావళి, వంశధార నదులపై కరకట్టలను పర్యవేక్షించాలని, నిరంతరం మానిటరింగ్ చేయాలని సూచించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లా డుతూ.. జిల్లాలో సంక్షేమ పథకాలను సక్ర మంగా అమలు చేస్తున్నామని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందిస్తు న్నామని, విపత్తుల నిర్వహణలో ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలి పారు. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అన్నిరంగాల్లో ముందంజలో నిలుపుతామని అన్నారు. సమీక్షలో భాగంగా యోగాంధ్ర- 2025, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో పాటు విపత్తులపై తక్షణ స్పందన, పింఛన్ల పంపిణీ, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చిం చారు. 81 శాఖల ద్వారా డిజిటల్ మానిట రింగ్ జరుగుతోందని, విపత్తుల సమాచా రాన్ని స్థానిక ప్రజలకు వేగంగా చేరవేస్తు న్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.వెంక టేశ్వరరావు, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.