బిల్లులు కాక.. భవనాలు అప్పగించక
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:41 PM
మండలం లోని శిరియా ఖండి సచివాలయం పరిధిలో రైతుసేవా, విలేజ్ క్లీనిక్ భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు అప్పగించడం లేదు.
మెళియాపుట్టి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలం లోని శిరియా ఖండి సచివాలయం పరిధిలో రైతుసేవా, విలేజ్ క్లీనిక్ భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు అప్పగించడం లేదు. ఈ సచివాలయ పరిధిలో రైతుసేవా కేంద్రం, విలేజ్ క్లీనిక్ భవనాలు పనులను ఎన్నికల ముందే పూర్తిచేశా రు. అయితే అప్పటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డిశాంతి భవ నం ప్రారంభించారు. బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవ డంతో కాంట్రాక్టర్ తాళాలు అధికారులకు అందజేయ లేదు.పనులు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా వినియో గంలో లేకపోవడంతో కిటికీలు, తలుపులకు చెదలు పట్టి పాడవుతున్నాయి.కొన్నిశ్లాబు, గచ్చులపెచ్చులు ఊడిపోతు న్నాయి.గోడలుదెబ్బతింటున్నాయి. పరిసరాల్లో పిచ్చిమొక్క లు పెరగడంతో విషజంతువులు సంచరిస్తున్నాయని స్థా నికులు చెబుతున్నారు.ఇప్పటికే సచివాలయం పరిధిలోని సుందరాడ,సిరియాఖండి, ముకుందుపురం పంచాయతీల గల ప్రజలకు రైతుసేవా కేంద్రం, విలేజ్ క్లీనిక్ సేవలను పాత పంచాయతీ భవనంలో అందజేస్తున్నారు. ఒకేగది కావడంతో సిబ్బంది విధుల నిర్వహణతోపాటు ప్రజలకు సేవలందించేందుకుఇబ్బందిపడుతున్నారు. కాగా బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టరు తాళాలు ఇవ్వడంలేదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఏఈ ఆనందరావు తెలిపారు.