అవగాహనతోనే జీఎస్టీ ప్రయోజనాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:00 AM
Super GST... Super Savings' Week Celebrations జీఎస్టీ ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్’ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్’ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ఈ ఎగ్జిబిషన్ ద్వారా జీఎస్టీ 2.0 ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరిస్తాం. ప్రతీ స్టాల్‌లో తప్పనిసరిగా జీఎస్టీ ద్వారా తగ్గిన వస్తువుల ధరల వివరాలను ప్రదర్శించాలి. తగ్గింపు ఎలకా్ట్రనిక్స్, మొబైల్ ఫోన్లు, కిచెన్ వస్తువులు, కంప్యూటర్లు, ఎసీలు, టీవీలు ఇలా వివిధ వస్తువులన్నీ ఒకేచోట లభిస్తాయి. పొందూరు చేనేత వస్ర్తాలు, హస్తకళల ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలంతా నాణ్యమైన వస్తువులను కొత్త జీఎస్టీ తగ్గింపు ధరల్లో కొనుగోలు చేయాల’ని కోరారు. అనంతరం స్వాతీసోమనాథ్ బృందంచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.