ఉచిత నిర్బంధ విద్యతో ప్రయోజనాలు: వీసీ
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:48 PM
మానవతా దృక్పథంతో ఉచిత విద్య నిర్బంధంగా అమలు చేయడం ద్వారా ప్రయోజనాలున్నాయని, దీనివల్ల అక్ష రాస్యతతో పాటు సామాజిక, ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అన్నారు.
ఎచ్చెర్ల, జూలై 11(ఆంధ్రజ్యోతి): మానవతా దృక్పథంతో ఉచిత విద్య నిర్బంధంగా అమలు చేయడం ద్వారా ప్రయోజనాలున్నాయని, దీనివల్ల అక్ష రాస్యతతో పాటు సామాజిక, ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సి టీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని అన్నా రు. వర్సిటీ విద్యా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రత్యేక విద్య, ఉచిత విద్య, నిర్భంద విద్యా హక్కు చట్టం’ అనే అంశంపై మూడు రోజుల నిరంతర పునరావాస విద్య (సీఆర్‌సీ) కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. న్యూఢిల్లీ భారత పునరావాస మండలి సహకారం (ఆర్‌సీఐ) సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తు న్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షణ తరగతులతో ప్రత్యేక విద్యా పాఠ శాల, ఎన్‌జీవోల్లో పనిచేసే బోధకులు, కౌన్సిలర్లు, శిక్ష కులు నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు. కార్య క్రమంలో వర్సిటీ ప్రిన్సిపాళ్లు ఎస్.ఉదయ భాస్కర్, ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు, విద్యా విభాగం అధ్యాపకులు ఎన్.శ్రీనివాస్, జేఎల్ సంధ్యా రాణి, హెచ్.సుబ్రహ్మణ్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సదస్సులో బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్
ఎచ్చెర్ల, జూలై 11(ఆంధ్రజ్యోతి): న్యూఢిల్లీలోని ఇండియా హెబిటేట్ సెంటర్‌లో శుక్ర వారం జరిగిన నేషనల్ క్వాంటమ్ మిషన్ (ఎన్.క్యూమ్) సదస్సులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత పాల్గొన్నారు. అలాగే జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జె.హుస్సేన్ నాయక్‌ను కలిసినట్లు తెలిపారు. వర్సిటీలో ఎస్టీ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై ఇటీవల వివరణ కోరుతూ కమీషన్ నుంచి లేఖ రావడంతో సం బంధిత సమాచారంతో రిజిస్ట్రార్‌తో పాటు హుస్సేన్ నాయక్ ను కలిసినట్లు పేర్కొన్నారు.