Share News

రోడ్డు ప్రమాదంలో యాచకురాలి మృతి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:28 AM

వాం డ్రంగి పంచాయతీ చీడిపేట కూడలి వద్ద సోమవారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలు బలగ భాగ్యలక్ష్మి (50) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదాన్ని చూసి తట్టుకోలేక తోటి యాచకుడు కోటి (65) ఒక్కసారి కుప్పకూలి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యాచకురాలి మృతి

జి.సిగడాం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వాం డ్రంగి పంచాయతీ చీడిపేట కూడలి వద్ద సోమవారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలు బలగ భాగ్యలక్ష్మి (50) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదాన్ని చూసి తట్టుకోలేక తోటి యాచకుడు కోటి (65) ఒక్కసారి కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనలు స్థానికంగా విషాదం నింపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి, ఒడిశా రాష్ట్రానికి చెందిన కోటి కొన్నాళ్లుగా స్థానిక చీడిపేట పాతబస్టాండ్‌ సమీపంలో ఉన్న ఆలయం వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సోమ వారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో భాగలక్ష్మిని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ వై.మధుసూదన రావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతి ఘటన చూసిన కోటి కూడా ఒక్కసారి బస్‌ షెల్టర్‌ వద్ద కుప్పకూలి మృతి చెందాడు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 26 , 2025 | 12:28 AM