Share News

మంచం పట్టిన టీడీవలస

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:53 PM

మండలంలోని టీడీవలస జ్వరాలతో మంచం పట్టింది. ఇంటింటా జ్వరాలబారిన పడ్డారు.

 మంచం పట్టిన టీడీవలస
జ్వరంతో బాధపడుతున్న చిన్నయ్య:

జి.సిగడాం,జూలై 1(ఆంధ్రజ్యోతి):మండలంలోని టీడీవలస జ్వరాలతో మంచం పట్టింది. ఇంటింటా జ్వరాలబారిన పడ్డారు. గ్రామంలో సుమారు 50 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన టంకాల చిట్టెమ్మ, టి.వెంకటేష్‌, బి.పాపారావు, టి.మోహనరావు, గిరిజాల శ్రీరాములు, సీహెచ్‌ శ్యాలమరావు, టి. శ్రీరాములు, టి.అప్పలనరసమ్మ, టి.చరణ్‌, టి.మోహిని, మాచర్ల గోపాలం, టి.లక్ష్మీ నారాయణ, టి.చంటి, టి.జయమ్మ, టి.ఉమా, బి.శ్రావణి, బి.రామచంద్రి నాయుడు, చెల్లూరి గుర్రమ్మ, టంకాల బానోజీ, సీహెచ్‌ చిన్నయ్య, జామి వరలక్ష్మిలతో పాటు మరో 30 మంది జ్వరాల బారినపడ్డారు. జ్వరాల బారిన పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని పలువురు వాపోతున్నారు.

గాడితప్పిన పారిశుధ్య నిర్వహణ

గ్రామంలోని కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలు, చెత్త పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ గాడితప్పింది. వీధుల్లో అపరిశ్రుభ వాతావరణం నెలకొంది. పారిశుఽధ్య నిర్వహణపై చర్యలు తీసుకోవడంలేదని, నెలల తరబడి పనులు చేపట్టకపోవడంతో దుర్వాసన వెలువడుతోందని గ్రామస్థులు ఆరోపిస్తు న్నారు. దీనికితోడు కలుషిత తాగునీరు వల్ల జ్వరాలబారిన పడుతున్నామని వాపో తున్నారు.నాలుగురోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నామని, వైద్యాధికారుల ఆచూకీలేకపోవడంతో ప్రైవేటు, సంచివైద్యులపై ఆధారపడాల్సివస్తోందని పలువు రు చెబుతున్నారు.కాగాఅక్కడక్కడ జ్వరాలు ఉన్నాయని, చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఆరుగురు జ్వరాలతో బాధపడుతున్నారని, సిబ్బందితో సేవలందిస్తున్నామని జి.సిగడాం పీహెచ్‌సీ వైద్యాధికారి యశ్వంత్‌ తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 11:53 PM