ఆర్థిక ఇబ్బందులతో స్మగ్లర్లుగా..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:12 AM
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేం దుకు గంజాయి స్మగ్లర్లుగా మారిన ముగ్గురు ఒడిశా వాసులు కాశీబుగ్గ పోలీ సులకు పట్టుబడ్డారు.

పలాస, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేం దుకు గంజాయి స్మగ్లర్లుగా మారిన ముగ్గురు ఒడిశా వాసులు కాశీబుగ్గ పోలీ సులకు పట్టుబడ్డారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ఒడిశా రాష్ట్రం హరుపదర్ గ్రామానికి చెందిన బినియా మనిమజి, ఆయన సోదరుడు అయుబామజి, దిపిరుగుడా గ్రామానికి చెందిన మైఖేల్ బధ్రాయిత 7.700 కిలోల గంజాయి తీసుకొని పలాస రైల్వే స్టేషన్‌కు వస్తుం డగా ఇందిరాచౌక్ వద్ద సీఐ బి.సూర్యనారాయణ తనిఖీ నిర్వ హిస్తుండగా ఈ ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారి బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి బయట పడింది. వెంటనే వారిని అరెస్టు చేసి బైక్, రూ.3900 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిపిరిగుడా గ్రామా నికి చెందిన జాన్ వద ్ద గంజాయి కొనుగోలు చేసి విజయ్ అనే వ్యక్తికి పలాస రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన జాన్ గంజాయి రవాణా చేస్తే కిలోకు రూ.1000 నగదు ఇస్తానని చెప్పడంతో అంగీకరించి రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ వ్యవ హారంలో ఐదుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన జాన్, విజయ్‌ల కోసం వెతుకు తున్నామన్నారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సీఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.