Share News

అడిగేవారు లేరని..

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:21 AM

మండలంలోని చల్లవానిపేట కూడలిలో భూములకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

అడిగేవారు లేరని..
రావిబంద చెరువును కప్పేసి చదును చేసిన దృశ్యం

చల్లవానిపేట కూడలిలో చెరువుల ఆక్రమణ

రోడ్డుపక్క మట్టితో కప్పేసి.. షెడ్లను నిర్మించిన వైనం

జలుమూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చల్లవానిపేట కూడలిలో భూములకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ సెంటు ధర రూ.10 లక్షల పైమాటే. దీంతో జలుమూరు రోడ్డులోని ఈశ్వరప్ప చెరువు, జర్జంగి రూటులో ఉన్న రావిబంద చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. రోడ్డు పక్కన వాటిని మట్టితో కప్పేసి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. రెండు ఎకరాల విస్తీర్ణం గల ఈశ్వరప్ప చెరువు గట్టు పూర్తిగా ఆక్రమణకు గురైంది. రావిబంద చెరువు కింద 20 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, ఈ చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించుకొని యథేచ్ఛగా భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు గట్లు, గర్భాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ జె.రామారావును వివరణ కోరగా.. ‘ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. తక్షణమే చల్లవానిపేట కూడలిలో ఆక్రమణలు తొలగిస్తాం? అని అన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:21 AM