Share News

చినవంకలో ఎలుగు సంచారం

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:02 AM

చినవంక పరిసరాల్లో గత రెండు రోజులుగా రాత్రి పూట ఎలుగుబంటి తిరుగతూ గ్రామస్థులు భ యాందోళనకు గురిచేస్తుంది.

చినవంకలో ఎలుగు సంచారం

వజ్రపుకొత్తూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): చినవంక పరిసరాల్లో గత రెండు రోజులుగా రాత్రి పూట ఎలుగుబంటి తిరుగతూ గ్రామస్థులు భ యాందోళనకు గురిచేస్తుంది. అర్ధరాత్రి వేళల గ్రామ సమీపంలోని పెద్దమ్మవారి గుడివద్ద సంచ రిస్తుండడాన్ని ఆ పక్కనే ఉన్న ఇంటి వద్ద ఏర్పా టు చేసిన సీసీ కెమేరాల్లో గుర్తించారు. గతంలో ఎలుగుబంటి చేసిన బీభత్సం ఇంకా మరువక ముందే మళ్లీ ఎలుగుబంటి సంచరిస్తుండడంతో గ్రామస్థులు హడిలిపోతున్నారు. ప్రస్తుతం జీడిపిక్కల పంట సీజన్‌ కావడంతో రైతులు నిత్యమూ తోటల్లో ఉంటారు. ఈ సమయంలో ఎలుగుబంటి సంచారం ఆందోళన కలిగిస్తుందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 12:02 AM