Share News

Beach festival: ఆకట్టుకున్న బీచ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - May 03 , 2025 | 11:35 PM

Tourism Event బారువ సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బారువ బీచ్‌ ఫెస్టివల్‌ ఆకట్టుకుంది. తొలిరోజు శనివారం వివిధ కార్యక్రమాలను నిర్వ హించారు.

Beach festival: ఆకట్టుకున్న బీచ్‌ ఫెస్టివల్‌
బీచ్‌ ఫెస్టివల్‌ను తిలకిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, విప్‌ అశోక్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు

  • ప్రత్యేక ఆకర్షణగా వాటర్‌ స్పోర్ట్స్‌

  • సోంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి): బారువ సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బారువ బీచ్‌ ఫెస్టివల్‌ ఆకట్టుకుంది. తొలిరోజు శనివారం వివిధ కార్యక్రమాలను నిర్వ హించారు. ఉదయం తాబేళ్ల పిల్లలను సముద్రంలోనికి విడిచిపెట్టడంతో ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ముఖ్యంగా వాటర్‌ స్పోర్ట్స్‌ ఆహుతులను విశేషంగా అలరించింది. సైకతశిల్పం ఆకట్టుకుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన కయాకింగ్‌ క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీపడ్డారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ట్రైనీ కలెక్టర్లు పర్యవేక్షించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన కిడ్స్‌పార్క్‌ ఆక ట్టుకుంది. బారువ తీరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్పీడ్‌ బోట్స్‌ పర్యాటకులను ఆకర్షించాయి. అధికారులు ట్రయల్‌ రన్‌ వేసిన తరువాత వీటిని ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన ఫుడ్‌ కౌంటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మెరైన్‌, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిరోజు కార్యక్రమాలు విజయవంతంగా జరగడంతో రెండోరోజైన ఆదివారం మరింత మంది పర్యాటకులు వస్తారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.


beach-festival-1.gif

Updated Date - May 03 , 2025 | 11:35 PM