వేధింపులపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:23 AM
సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వేధింపులపై ఉద్యోగినులు అప్రమత్తంగాఉండాలని డీఎస్పీ సీహెచ్ వివేకా నంద పేర్కొన్నారు.గురువారం పైడిభీమవరం రెడ్డీస్ లేబరేటరీ పరిశ్రమ ల్లో నారీశక్తి కార్యక్రమంపై ఉద్యోగినులకు అవగాహన కల్పించారు.
రణస్థలం, జూలై 10(ఆంధ్రజ్యోతి):సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వేధింపులపై ఉద్యోగినులు అప్రమత్తంగాఉండాలని డీఎస్పీ సీహెచ్ వివేకా నంద పేర్కొన్నారు.గురువారం పైడిభీమవరం రెడ్డీస్ లేబరేటరీ పరిశ్రమ ల్లో నారీశక్తి కార్యక్రమంపై ఉద్యోగినులకు అవగాహన కల్పించారు.మహిళా భద్రత,దాడులు, గృహహింస,సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న వేధిం పులు, శక్తియాప్ ఉపయోగం, మహిళరక్షణకుగల చట్టాలు, సురక్ష క్యూఆర్ కోడ్‌పై వివరించారు. మహిళ సురక్షిత ప్రయాణం కోసం ఆటోలకు సురక్ష క్యూఆర్ కోడ్ యాప్ అందుబాటులోకి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల తీసుకొచ్చారని వివరించారు.ఆటోలో ప్రయాణం చేసే సమయంలో ఎటు వంటి ఆపదవచ్చినా మహిళలు క్యూఆర్‌కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆటో డ్రైవర్ పూర్తివివరాలు తెలుస్తాయని వివరిచారు. కార్యక్రమంలో జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్‌ఐ ఎస్ చిరంజీవి పాల్గొన్నారు.