Share News

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 16 , 2025 | 11:59 PM

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కోరారు. శుక్రవారం జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యసిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీలను సిబ్బంది నిర్వహించారు.

 డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి
సంతబొమ్మాళి: డెంగ్యూపై అవగహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది:

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కోరారు. శుక్రవారం జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యసిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీలను సిబ్బంది నిర్వహించారు.

ఫఎల్‌.ఎన్‌.పేట, మే 16(ఆంధ్రజ్యోతి) గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధులను నివారించడం సాధ్యమని వైద్యాధికారి వసుధ తెలిపారు. తురకపేటలో పీహెచ్‌సీ నుంచి డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఫసంతబొమ్మాళి,మే16(ఆంద్రజ్యోతి):దండుగోపాలపురం పీహెచ్‌సీ సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని డ్యెంగూపై అవగహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి శివరంజని,సూపర్‌వైజర్‌ నాగేశ్వరరావు,ఆప్తాలమిక్‌ అసిస్టెంట్‌ ఎం.ఆర్‌.కె.దాస్‌ ,ఫార్మాసిస్టు సుబ్రమణ్యం సిబ్బంది పాల్గొన్నారు.

ఫజలుమూరు, మే 16 (ఆంధ్రజ్యోతి):అచ్యుతాపురం ఆరోగ్య కేంద్రం సిబ్బంది,ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్య క్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి పూజారి సుజాత పాల్గొన్నారు.

ఫ నరసన్నపేట, మే 16(ఆంధ్రజ్యోతి): ఉర్లాం పీహెచ్‌సీ వైద్యులు గొలివి సుజాత, షాలిని డెంగ్యూపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ జీవీ రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:59 PM