సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:00 AM
విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ పైడిపునాయుడు తెలిపారు. మంగళవారం తూలుగు యూపీ స్కూల్‌లో విద్యార్థులకు నారీశక్తిపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు.
గార/గారరూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ పైడిపునాయుడు తెలిపారు. మంగళవారం తూలుగు యూపీ స్కూల్‌లో విద్యార్థులకు నారీశక్తిపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గార ఎస్‌ఐ ఎస్.గంగరాజు, హెచ్‌ఎంలు చమళ్ల రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫఇచ్ఛాపురం,జూలై 29(ఆంధ్రజ్యోతి):నారీశక్తియాప్ మహిళలకు రక్షణ గా ఉంటుందని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. డొంకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నారీశక్తి యాప్‌పై అవగాహన కల్పించా రు.కార్యక్రమంలో గోవిందరావు, రమణ, వజీర్, శంకరరెడ్డి పాల్గొన్నారు.
ఫఆమదాలవలస, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని ఏడో వార్డు చింతాడ ప్రాథమిక పాఠశాల హైస్కూల్‌లోని విద్యార్థులకు శక్తి టీం ఇన్‌చార్జి వాసుదేవరావు ఆధ్వర్యంలో శక్తియాప్‌పై అవగాహన కల్పించారు. కార్య క్రమంలో ఏఎస్‌ఐ డి.రమణమూర్తి, పోలీసులు మోహన్‌రావు, ఉషారాణి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.