Share News

యూరియా కోసం బారులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:46 PM

: యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. వరి పైరుకు యూరియా వేసుకోవడానికి ఇదే మంచి అదును కోవడంతో దానికోసం రైతులు అన్వేషిస్తున్నారు.

యూరియా కోసం బారులు
యూరియా కోసం ఓ దుకాణం వద్ద బారులుతీరిన రైతులు

ఎల్‌.ఎన్‌.పేట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. వరి పైరుకు యూరియా వేసుకోవడానికి ఇదే మంచి అదును కోవడంతో దానికోసం రైతులు అన్వేషిస్తున్నారు. కావలసిన ఎరువులు అందించడంలో అధికారులు విఫలమవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో యూరియా కొనుగోలు కోసం ప్రైవేటు దుకాణాల వద్ద బారులు తీరున్నారు. దుకాణదారులు యూరియాతో పాటు తెగుళ్ల నివారణ మందులు అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. లక్ష్మీనర్సుపేట జంక్షన్‌లోని ఓ దుకాణం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

Updated Date - Aug 26 , 2025 | 11:46 PM