Bakrid: భక్తి శ్రద్ధలతో బక్రీద్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:40 PM
Muslim festival జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ చేసుకున్నారు. శనివారం శ్రీకాకుళంలోని ప్రసిద్ధి చెందిన జామియా మసీదులో మతపెద్ద ఇమామ్ వహాబ్ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ముస్లింలు పాల్గొని నమాజ్ చేశారు.
శ్రీకాకుళం కల్చరల్/ కలెక్టరేట్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ చేసుకున్నారు. శనివారం శ్రీకాకుళంలోని ప్రసిద్ధి చెందిన జామియా మసీదులో మతపెద్ద ఇమామ్ వహాబ్ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ముస్లింలు పాల్గొని నమాజ్ చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ కూడా నమాజ్ కార్యక్రమంలో పాల్గొని.. శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇస్లాం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. దేవుడి చూపిన మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలి. బక్రీద్.. వేడుక మాత్రమే కాదు. భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల రూపం’ అని జేసీ వెల్లడించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు షాన్, అక్బర్ బాషా, అమీరుల్లా, షాకూర్ఖాన్, ఉస్మాన్ జాఫర్, మహిబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ.. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు.