Share News

ఎరువులపై అవగాహన కల్పించాలి: ఆర్డీవో

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:34 PM

ఎరువుల సరఫరాపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆర్డీవో సాయి ప్రత్యూష అన్నారు.

ఎరువులపై అవగాహన కల్పించాలి: ఆర్డీవో
గార: మాట్లాడుతున్న ఆర్డీవో సాయి ప్రత్యూష

గార, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎరువుల సరఫరాపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆర్డీవో సాయి ప్రత్యూష అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రైతు సేవా కేంద్రాల సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులకు అవస రమైన ఇండెంట్‌లను సంబంధిత సిబ్బంది సిద్ధం చేయాలని, ఎరువులు వచ్చిన వెంటనే వారికి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బాలకృష్ణ, ఎంపీడీవో ఈశర్ల రాము, తహసీల్దార్‌ చక్రవర్తి, ఏవో డి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

యూరియా సరైన మోతాదులో వాడాలి

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పంటల్లో యూరియాను సరైన మోతాదులో వాడితేనే ప్రయోజనమని మండల ప్రత్యేకాధికారి సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం లొద్దపుట్టి, మండపల్లి, బిర్లంగి గ్రామాల్లో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కలిగిం చారు. యూరియా పంపిణీ ఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌, ప్రైవేట్‌ డీలర్ల ద్వారా జరుగు తుందని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని తగి నంత మో తాదులో అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు, ఎంపీడీవో రామారావు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:34 PM