బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:41 PM
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను క్షేత్ర స్థాయిలో అవగాహ న కలిగించాలని ఐసీడీఎస్ సీడీపీవో శోభారాణి సూచిం చారు.
గార జూలై 21 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను క్షేత్ర స్థాయిలో అవగాహ న కలిగించాలని ఐసీడీఎస్ సీడీపీవో శోభారాణి సూచిం చారు. సోమవారం కొల్లివలసలో ఐసీడీఎస్ ప్రోజెక్టు కార్యాలయంలో గార, శ్రీకాకుళం మండలాల అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని దీని వల్ల కలిగే చెబు ప్రభావాలను ప్రజలకు వివ రించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రా లను నిర్దేశిత వేళల్లో తెరిచి ఉంచా లన్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఆ నెలలో అందించిన పోషకాలు, ప్రీ స్కూల్‌పై వివరించాలన్నారు.
ఆడపిల్లలను చదివిద్దాం
ఆమదాలవలస, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలను చదివిద్దాం.. ఆడపిల్లలను రక్షిద్దాం అని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి కె. ప్రసన్నరాణి అన్నారు. సోమవారం పట్టణంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహహింస, అత్యాచారాలు, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, యూసిడ్ దాడులు మహిళల అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కళా శాల సిబ్బంది భాస్కరరావు వై.పుష్పలత, పుష్ప పాల్గొన్నారు.