నేత్రదానంపై అవగాహన అవసరం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:29 PM
నేత్రదానంపై ప్రతిఒక్కరిలోనూ అవగహన అవసరమని వైద్య సిబ్బంది తెలిపారు. మంగళవారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నేత్రదానంపై ప్రతిఒక్కరిలోనూ అవగహన అవసరమని వైద్య సిబ్బంది తెలిపారు. మంగళవారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మెళియాపుట్టి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నేత్రదానం చేసి ఇతరులకు సహా యం చేయాలని ఆప్తమాలజిస్టు బీజీఎస్ ప్రసాద్ తెలిపారు.మెళియాపుట్టిలో నేత్ర దాన పక్షోత్సవాలు పురస్కరించుకుని వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ఫ సంతబొమ్మాళి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): స్థానిక పీహెచ్‌సీలో నేత్రదా నంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంతబొమ్మాళి పీహెచ్‌సీ వైద్యాదికారి శివరంజని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, అప్తలమిక్ అధికారి ఎంఆర్‌కే దాస్ పాల్గొన్నారు.