పథకాలపై అవగాహన అవసరం: పీడీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:52 PM
: యువతకు ప్రధాన మంత్రి రైతునిధి, ఆయుష్మాన్ భారత్, నైపుణ్య భారత్ వంటి ప్రధాన పథ కాలపై అవగాహన అవసరమని డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ మహాన్ వారి ఆధ్వర్యంలో వర్క్‌షాప్ జరిగింది.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): యువతకు ప్రధాన మంత్రి రైతునిధి, ఆయుష్మాన్ భారత్, నైపుణ్య భారత్ వంటి ప్రధాన పథ కాలపై అవగాహన అవసరమని డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ మహాన్ వారి ఆధ్వర్యంలో వర్క్‌షాప్ జరిగింది. కార్యక్రమంలో మేరా యువ భారత్ ఉప సంచాలకుడు కె.వెంకట్ ఉజ్వల్,జిల్లా పరిశ్రమల అధికారి శ్రీధర్, నాబార్డు అధికారి కె.రమేష్‌కృష్ణ, లీడ్‌బ్యాంకు మేనేజర్ పి.శ్రీనివాసరావు, సెట్‌శ్రీ సీఈవో వీవీఅప్పలనాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్, స్వీప్‌నిర్వాహకుడు కె.రమణమూ ర్తి, స్పందన అధ్యక్షుడు పి.కృష్ణారావు పాల్గొన్నారు.