Share News

ఆధ్యాత్మికవేత్తలకు పురస్కార ప్రదానం

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:32 PM

మునగవలస గ్రామానికి చెందిన ఆధ్యాత్మికవేత్త మావుడూరు అన్నాజీ శర్మకు జ్యోతిషరత్న అవార్డు లభించింది.

ఆధ్యాత్మికవేత్తలకు పురస్కార ప్రదానం
సరుబుజ్జిలి: అన్నాజీ మాస్టార్‌కు సత్కరిస్తున్న దృశ్యం

ఆమదాలవలస, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మునగవలస గ్రామానికి చెందిన ఆధ్యాత్మికవేత్త మావుడూరు అన్నాజీ శర్మకు జ్యోతిషరత్న అవార్డు లభించింది. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రతిభ కళా సాం స్కృతిక సంస్థ వివిధ రంగాల్లో పలువురు ప్రముఖులను సత్కరించింది. ఈ నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ గురుకుల పాఠశాలలో తెలుగు లెక్చరర్‌గా విధులు నిర్వహి స్తున్న అన్నాజీరావును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

నాగేశ్వర శర్మకు..

ఎచ్చెర్ల, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జ్యోతిష పండి తుడు, ఆధ్యాత్మికవేత్త పట్నాల నాగేశ్వర శర్మకు జ్యోతిషరత్న అవార్డు ప్రదానం చేశారు. అల్లినగరం పంచాయతీ ప్రశాంత్‌ నగర్‌ కాలనీకి చెందిన నాగే శ్వర శర్మకు విశాఖపట్నం ప్రతిభ క్రీడా, కళా సాం స్కృతిక సంస్థ ఈ అవార్డు అందించింది. ఈయ నను పలువురు అభినందించారు.

చౌదరి శ్రీనివాస్‌కు కళారత్న..

గార రూరల్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జొన్నలపాడు గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాస్‌కు కళారత్న పురస్కారం అందించారు. విశాఖ పట్నంనకు చెందిన ప్రతిభ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పౌర గ్రంథా లయంలో ఆదివారం మాజీ మేయర్‌ దాడి సత్యనారాయణ జ్ఞాపిక, ప్రశం సాపత్రం అందించారు. సత్సంగం, భక్తి గేయాలాపన, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందించారు.

Updated Date - Aug 31 , 2025 | 11:32 PM