ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:08 AM
అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు హితవు పలికారు.
మాజీమంత్రి ధర్మానకు ఎమ్మెల్యే శంకర్ హితవు
అరసవల్లి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు హితవు పలికారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల భూములకు సంబం ధించిన పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి బొమ్మను వేసిందెవరు? అదేమైనా ఆయన సొంత ఆస్తా అని ప్రశ్నిస్తూ రెండు ప్రభుత్వాల్లో ఇచ్చిన పాస్ పుస్తకాలను ప్రదర్శిం చారు. రెవెన్యూ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి కూటమి ప్రభుత్వంపై అర్థరహిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. రీసర్వే పేరుతో వేలాది ఎకరాలను లాక్కున్నదెవరని ప్రశ్నించారు. జిల్లాకు ఒక కొత్త పరిశ్రమ నైనా తీసు కువచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతీ గ్రామం లో రోడ్లను వేస్తున్నామని, ఉచిత ఇసుకను అందించి ఇసుక మాఫియా ఆగడాలను నివారించామన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్టు తెచ్చి సామాన్యుడి భూమికి రక్షణ కల్పించామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో జరగుతున్న అభివృద్ధిని, పారదర్శక పాలనను ఆమోదించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, నేతలు కలగ జగదీష్, పీఎంజే బాబు, అరవల రవీంద్ర, కొర్ను నాగార్జున ప్రతాప్, ప్రధాన వి.జయరాం, ఎస్వీ రమణమాదిగ, పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు.