Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:19 AM

యువత మత్తు పదార్థాలకు... చెడు వ్య సనాలకు దూరంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
టెక్కలిలో సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

  • ఆటపాటలతో అభ్యుదయ సైకిల్‌ ర్యాలీ

టెక్కలి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు... చెడు వ్య సనాలకు దూరంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. వీటితో జీవితా లు నాశనమవుతాయని హెచ్చరించారు. బుధవారం ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినా దంతో ‘అభ్యుదయం’ పేరుతో భారీ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. వే లాది మంది విద్యార్థులు కిలో మీటర్ల మేర బారులు తీరి... డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా ఆటపాటలతో అల రించారు. చిన్నారుల కోలాటం ప్రదర్శన, తప్పెటగుళ్లు కళాకారుల విన్యాసాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వక్త లు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడితే బంగారు భవిష్యత్తు నాశనమవు తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మణరెడ్డి, సీఐ విజయ్‌ కుమార్‌, ఎంవీఐ సంజీవరావు, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, కోళ్ల లవకుమార్‌, మామిడి రాము, ప్రీతీష్‌, ప్రసాద్‌ రెడ్డి, షణ్ముఖరావు, ఎస్‌ఐ రాము తదితరులు పాల్గొన్నారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నౌపడ మీదుగా...

సంతబొమ్మాళి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌కు యువత దూ రంగా ఉండాలని తహసీల్దార్‌ బి.హేమసుందరరావు అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అభ్యుదయ సైకిల్‌ ర్యాలీ బుధవారం నౌపడ కు చేరుకుంది. జీవితం చాలా విలువైనదని డ్రగ్స్‌ బారిన పడొద్దంటూ నినాదంలో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, పోలీసులు పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నౌపడ, సంతబొ మ్మాళి ఎస్‌ఐలు నారాయణస్వామి, సింహోచలం పాల్గొన్నారు.

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో పాయకరావు పేట నుంచి ప్రారంభమైన అభ్యుధయ సైకిల్‌ యాత్ర బుధవారం దేవునల్తాడ జంక్షన్‌ వద్ద మండలంలోకి ప్రవేశించింది. సైకిల్‌ యా త్రకు కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్‌ స్వాగతం పలికగా పూండి వరకు కొనసాగింది. గురువారం క్రిస్మస్‌ కారణంగా విరామం తీసుకుని శుక్రవారం నుంచి యాత్ర కొనసాగుతుందని ఎస్‌ఐచెప్పారు. టీడీపీ నాయకులు గోవిదందు పాపా రావు, అఖిల్‌, అప్పోజీ యాత్రలో పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:19 AM