Share News

అవగాహనతో డయాబెటిస్‌ దూరం

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:34 PM

అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకో వచ్చని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్‌ అన్నారు.

అవగాహనతో డయాబెటిస్‌ దూరం
అరసవల్లి: ర్యాలీని ప్రారంభిస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో మేరీ క్యాథరీన్‌

అరసవల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకో వచ్చని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్‌ అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాంక్రియాస్‌ ద్వారా తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి జరగకపోతే, శరీరం దానిని సమర్థవంతంగా వినియోగించుకోలేదని, దీనినే మధుమేహం అంటారన్నారు. తగినంత బరువు కలిగి ఉండడం, ప్రతీరోజు అర గంట వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండాలన్నారు. తరచూ దాహం వేయడం, రాత్రి వేళల్లో మూత్ర విసర్జన, నీరసం, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించా లన్నారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా.రాందాసు, డా.రవీంద్ర, డా. జీవీలక్ష్మి, డా.సుజాత, రామనాగేశ్వరరావు, సత్యనారాయణ, మోహిని, డీపీవో ముళి, తదితరులు పాల్గొన్నారు.

డా.అన్నెపు శశిధర్‌ ఆధ్వర్యంలో మెగా మెడికల్‌ క్యాంపు

అరసవల్లి, నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): ప్రపంచ మధుమేహ దినో త్సవం సందర్భంగా డా.అన్నెపు శశిధర్‌ ఆసుపత్రిలో శుక్రవారం మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సంద ర్భంగా డా.శశిధర్‌ (ఎండీ జనరల్‌ మెడిసన్‌) మధుమేహం నివారణ, నిర్ధారణ, చికిత్సలపై ప్రజలకు అవ గాహన కల్పించారు. జీవనశైలిలో మార్పులు, స్ర్కీనింగ్‌ ప్రాముఖ్యతలను, ఈ వ్యాధి నివారణోపాయాలను వివ రించారు. రోగులకు మధు మేహవ్యాధి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Updated Date - Nov 14 , 2025 | 11:34 PM