Share News

ఆటోల ఫిట్‌నెస్‌ పరీక్ష ఇచ్ఛాపురంలో చేపట్టండి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:29 AM

ఆటోలు, ట్రాక్టర్‌ల ఫిట్‌నెస్‌ ఇచ్ఛాపురంలో చేపట్టాలని భగవతి, శ్రీస్వేచ్ఛావతి ఓనర్స్‌, డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌, ఆటో యూనియన్ల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

ఆటోల ఫిట్‌నెస్‌ పరీక్ష ఇచ్ఛాపురంలో చేపట్టండి
ర్యాలీ నిర్వహిస్తున్న ఆటోయూనియన్‌ సభ్యులు

ఇచ్ఛాపురం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఆటోలు, ట్రాక్టర్‌ల ఫిట్‌నెస్‌ ఇచ్ఛాపురంలో చేపట్టాలని భగవతి, శ్రీస్వేచ్ఛావతి ఓనర్స్‌, డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌, ఆటో యూనియన్ల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి మండలాల పరిధిలో ఆటోలు నడుపుతున్న డ్రైవర్‌లు, ఆటో యజమానులు ఇచ్ఛాపురం నుంచి అమీన్‌ సహేబ్‌పేట మీదుగా హైవే వరకు ఆటోల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో యజమానులు, డ్రైవర్లు ఇబ్బందిపడుతన్నారన్నారు. కార్యక్రమంలో బారువ, కొర్లాం, కంచిలి, ఈదుపురం, ఇచ్ఛాపురం, ఎంఎస్‌ పల్లి, రాజపురం, ధర్మపురం, లొద్దపుట్టి, డొంకూరు, జాడుపూడి, సోంపేట, కంచిలి, కవిటి ఆటో యూనియన్‌ సభ్యులు, డ్రైవర్‌లు, ఆటో యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:29 AM