విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 AM
విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఎస్‌డబ్యూఆర్ ఈఐ సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్‌కుమార్ ఆదేశించారు.
హరిపురం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఎస్‌డబ్యూఆర్ ఈఐ సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం మందస మండలంలోని రాధాకృష్ణాపురంలోగల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ, నీట్‌కు శిక్షణ ఇస్తున్న అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని కోరారు. ఆయనతోపాటు డీసీవో యశోదలక్ష్మి, పిన్సిపాల్ ఎల్.లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.