Share News

విభిన్న ప్రతిభావంతులపై శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:30 PM

విభిన్న ప్రతిభావంతులైన పిల్లలపై సమాజం శ్రద్ధ వహించి వారికి అన్ని విధాలా తోడుగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

విభిన్న ప్రతిభావంతులపై శ్రద్ధ వహించాలి
మానసిక దివ్యాంగ పిల్లలకు మిఠాయిలు పంచుతున్న కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతులైన పిల్లలపై సమాజం శ్రద్ధ వహించి వారికి అన్ని విధాలా తోడుగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో సమావేశం నిర్వహించారు. అక్కడ ఉంటున్న విద్యార్థులు, వారికి అందిస్తున్న సేవలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధిహీనత ఉన్న పిల్లలను గుర్తించి వారికి పథకాలను సక్రమంగా అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయి లు పంచిపెట్టారు. కార్యక్రమంలో న్యాయవాది ఇందిరా ప్రసాద్‌, కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

అసాధారణ విభిన్నతే ప్రత్యేక గుర్తింపు

పాత శ్రీకాకుళం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): అసాధారణ ప్రతిభ కలిగిన వారే ప్రతిభావంతులని మెప్మా పీడీ ఎస్‌. వెంకటరావు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం స్థానిక ఎంపీసీఆర్సీలో నిర్వహిం చారు. విభిన్న ప్రతిభా వంతుల అభ్యున్నతికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. విభిన్న ప్రతిభావంతుల మనోవికాసా నికి బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా సాంకేతిక నిపుణుడు బి.రామారావు, శ్రీనిధి పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

దివ్యాంగులను గౌరవిద్దాం

టెక్కలి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులను గౌరవించడం మనందరి బాధ్యత అని స్థానిక సివిల్‌ కోర్టు నాయాధికారి బి.నిర్మల అన్నారు. బుధవారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక భవిత కేంద్రంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, ఏజీపీ డి.వివేకానంద, ఎంఈవోలు డి.తులసీరావు, చిన్నారావు, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి పాల్గొన్నారు.

పలాస: దివ్యాంగులకు ఉచిత న్యాయసహాయం అందుబాటులో ఉందని పలాస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఫయ్యజ్‌అహ్మద్‌ (ఘని) అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో దివ్యాంగులకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. న్యాయ వాదులు ఎస్‌.నాగేశ్వరరావు, సిహెచ్‌.దివ్వశ్రీ, వై.తిరుపతి రావు, డి.అనంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:30 PM