స్నేహితుడిపై హత్యాయత్నం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:54 PM
ఒకే వృత్తి చేసుకుం టూ కలిసి మెలిసి ఉండే స్నేహి తుల మధ్య ఏర్పడిన వివాదం మాటమాట పెరిగి హత్యాయ త్నానికి దారి తీసిన ఘటన గెడ్డ కంచరాంలో ఆదివారం సంభ వించింది.
రిమ్స్‌కు తరలింపు
పరిస్థితి విషమం
జి.సిగడాం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఒకే వృత్తి చేసుకుం టూ కలిసి మెలిసి ఉండే స్నేహి తుల మధ్య ఏర్పడిన వివాదం మాటమాట పెరిగి హత్యాయ త్నానికి దారి తీసిన ఘటన గెడ్డ కంచరాంలో ఆదివారం సంభ వించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన విరాలిలా ఉన్నాయి.. గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కల్ల రాజశేఖర్ ఇదే మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి గొల్లబాబు అలియాస్ శంకర్ మంచి స్నేహితు లు. అయితే వీరు మద్యం కోసం గొడవపడి మాటామాట పెరిగి గెడ్డకంచరాం కూడలి వద్ద గొల్లబాబు.. పుక్కల్ల రాజశేఖర్ కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహు టిన ఘటనా స్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనంపై జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహ నంలో సిబ్బంది సతీష్, మూర్తి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజ శేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ గృహ, ఇతర నిర్మాణాలకు పెయింటింగ్ వేస్తుంటారు. బాధితుడిని విచారణ చేస్తే గాని పూర్తి వివరాలు తెలియవని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.