Share News

ఇసుక ర్యాంపుపై దాడులు

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:57 PM

17 vehicles seized పొందూరు మండలంలో అనధికార ఇసుక ర్యాంపులు, అక్రమ ఇసుక నిల్వలపై అధికారులు దాడులు చేశారు. మొత్తం 17 వాహనాలను సీజ్‌ చేశారు.

ఇసుక ర్యాంపుపై దాడులు
బొడ్డేపల్లి ర్యాంపును పరిశీలిస్తున్న అధికారులు

అక్రమ నిల్వలు కూడా పరిశీలన

17 వాహనాలు సీజ్‌

పొందూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పొందూరు మండలంలో అనధికార ఇసుక ర్యాంపులు, అక్రమ ఇసుక నిల్వలపై అధికారులు దాడులు చేశారు. మొత్తం 17 వాహనాలను సీజ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం బొడ్డేపల్లిలో ఇసుక ర్యాంపును, కింతలి నుంచి మొదలవలస వరకు ఇరువైపులా ఉన్న భారీ ఇసుక నిల్వలను జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో ఇసుకలోడులో ఉన్న మూడు భారీ టిప్పర్లు, పది ట్రాక్టర్లను అడ్డుకున్నారు. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను లోడ్‌ చేస్తున్న నాలుగు ప్రొక్లయినర్లను స్వాధీనం చేసుకున్నారు. ర్యాంపు నిర్వాహకుల గురించి వాహనడ్రైవర్లను ప్రశ్నించారు. తాము కేవలం ఇసుకను మాత్రమే తీసుకెళ్తామని, లావాదేవీలన్నీ తమ వాహన యజమానులే చూస్తారని డ్రైవర్లు చెప్పారు. నిల్వల వద్ద, ర్యాంపులో లోడుల సమాచారంతో ఉన్న రికార్డులను జేసీ స్వాధీనం చేసుకుని అధికారులకు అప్పగించారు. ఇసుక నిల్వలు, ర్యాంపు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేసి.. వాహనాలను స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, మైనింగ్‌ డీడీ మోహనరావు, ఏడీ విజయలక్ష్మి, పొందూరు తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, ఎస్‌ఐ బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:57 PM