ఏపీఎంపై దాడి అమానుషం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:31 PM
:అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మం డలం ఏపీఎం రజనీపై దాడిని ఇచ్ఛాపురం మండల వెలుగు సిబ్బంది ఖం డించారు.
ఇచ్ఛాపురం, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి):అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మం డలం ఏపీఎం రజనీపై దాడిని ఇచ్ఛాపురం మండల వెలుగు సిబ్బంది ఖం డించారు.ఈ మేరకు ఇచ్ఛాపురంలో ఏపీఎం ప్రసాద్, జిల్లా ఏపీఎంల (సెర్ఫ్-డీఆర్‌డీఏ) సంక్షేమ సంఘ అధ్యక్షుల ఆధర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి దుశ్చర్యను సహించబో మని, అమానుషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘ అధ్యక్షులు ఎస్.ప్రసాద్, సీసీలు మోహన్‌రావు, దాలయ్య, అకౌంటెంట్లు మోహిని, వాణిభవాని, గ్రామ సంఘ సహాయకులు పాల్గొన్నారు.
ఫ సోంపేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ఏపీఎం రజీనీపై దాడికి పాల్పడినవారిని శిక్షించాలని ఏపీఎం ఎస్.ప్రసా దరావు కోరారు. సోంపేటలో దాడికి నిరసనగా వెలుగు సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీసీలు జె.శ్రీనివాసరావు, బి.పాపారావు, పి.గణపతిరావు, టి.శ్రీనివాసరావు, భారితి, రాజేశ్వరి పాల్గొన్నారు.