గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:28 AM
స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న డీబీ అప్పన్న(56) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్టు ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌బాబు తెలిపారు.
మెళియాపుట్టి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న డీబీ అప్పన్న(56) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్టు ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గురువారం మెళియాపుట్టి రోడ్డులో ఒ డిశా రాష్ట్రానికి చెందిన మంత్రి వెళ్తుండడంతో జంక్షన్‌లో అప్పన్న విధుల్లో ఉన్నారు. మంత్రి కాన్వాయ్ వెళ్లిపోయి న తర్వాత చాపరలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్న ఆయన భోజనానికి ఇంటికి వెళ్లారు. సుమారు రెండు గంటల సమయంలో గుండెల్లో మంటగా ఉంద ని స్టేషన్ విధుల్లో ఉన్న హెచ్‌సీ రమణకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. రమణ వెళ్లేసరికి చాపర ఆరోగ్యకేంద్రానికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అప్పటికే అప్పన్న మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అప్పన్న స్వగ్రామం ఎచ్చెర్ల మండలం ఏఆర్ పోలీసు క్వార్టర్స్ (లింగాలపేట) ఏరియా. ఆయనకు భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. కాగా 1989లో అప్పన్న కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 2021లో ఏఎస్‌ఐగా ఉద్యోగు న్నతి పొందారు. అప్పటి నుంచి మెళియాపుట్టిలోనే విధులు నిర్వహిస్తు న్నారు. అందరితో స్నేహంగా ఉండే అప్పన్న మృతిపై పాతపట్నం సీఐ సన్యాసి నాయు డు, ఎస్‌ఐ రమేష్‌బాబు, ఎస్‌బీ, హెచ్‌సీ సింహాచలం తదితరులు విచారం వ్యక్తం చేసి, అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఏఎన్‌ఎం..
కొత్తూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కడుము-కిడి గాం రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో కడుము ఏఎన్‌ఎం ఆర్.మాలతీ బాయి(48) మృతి చెందినట్టు హెచ్‌సీ కోటేశ్వరావు తెలిపారు. హెచ్‌సీ తెలిపిన వివరాల మేరకు.. కురిగాం పీహెచ్‌సీ పరిధిలో ఉన్న కడుము ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న మాలతి కన్నవారి గ్రా మం ఒడిశా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటున్నారు. మాలతి ఎప్పటిలాగే కడుము సచివాలయానికి విధుల కోసం ద్విచక్ర వాహనం పై వస్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయ మై అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ తెలిపారు.
పాముకాటుతో రైతు..
నరసన్నపేట, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): నడగాం గ్రామానికి చెందిన కరణం రామదాస్(47) పాముకాటుకు గురై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామదాస్ తన పొలానికి వెళ్లి పనులు ముగిం చుకుని తిరిగి వస్తుండగా గట్టుపై ఉన్న పాము కాటువేసింది. వెంటనే రోడ్డుపైకి చేరుకుని గ్రామస్థుల సహకారం తో ద్విచక్ర వాహనంపై చికిత్స నిమిత్తం నరసన్నపేట ఏరియా ఆసుపత్రి వెళ్లాడు. అయితే అప్పటికే నోటి నుంచి నురగలు కక్కుతూ పడిపోయాడు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. రామదాస్ భార్య రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. రామ్‌దాస్‌కు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.