బాలియాత్రకు ఏర్పాట్లుచేయాలి: ఆర్డీవో
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:03 AM
శ్రీముఖలింగంలో వచ్చేనెల 9న కార్తీకమాసం పురస్కరించుకొని నిర్వహించే బాలియాత్ర దీపోత్సవానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుచేయాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష ఆదేశించారు. మంగళవారం జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షించారు.
జలుమూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో వచ్చేనెల 9న కార్తీకమాసం పురస్కరించుకొని నిర్వహించే బాలియాత్ర దీపోత్సవానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుచేయాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష ఆదేశించారు. మంగళవారం జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా యాత్రకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని శ్రీముఖలింగేశ్వరాలయం ఈవో ఏడుకొండలకు ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావుకు సూచించారు. సమావేశంలో తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, బాలియాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.