భక్తుల దర్శనానికి పక్కా ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:46 PM
కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భక్తులకు అసౌ కర్యం కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పక్కాఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ తెలిపారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భక్తులకు అసౌ కర్యం కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పక్కాఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం కోటబొమ్మాళిలో ఏర్పాటుచేసిన హెలి కాప్టర్ రైడ్‌టికెట్లు కౌంటర్‌ను పరిశీలించారు.ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగే లా చర్యలుతీసుకోవాలని డీపీవోకు ఆదేశించారు. హెలికాప్టర్ రైడ్‌కు వచ్చే పర్యాటకు లకు మౌలికసదుపాయాలు కల్పించాలని,హెలిపాడ్ వద్ద ఫైర్‌సేఫ్టీ, వైద్య శిబిరం ఏర్పా ట్లుచేయాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, తాగునీటి సదుపాయం, రాకపోకలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. క్యూలైన్లను పరిశీలించారు. పీఏసీఎస్‌మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్ కలెక్టర్‌నుకలిశారు.కార్యక్రమం లో డుమాపీడీ సుధాకర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, నెహ్రూయువకేంద్ర సహా య సంచాలకుడు వెంకట్ ఉజ్వల్,డీపీవో భారతి సౌజన్య, జిల్లా సమాచార పౌర సం బంధాల అధికారి కె.చెన్నకేశవరావు, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్, డీఎస్పీ లక్ష్మణరావు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, కొత్త మ్మతల్లి ఆలయ ఈవో రాధాకృష్ణ పాల్గొన్నారు.