ఫారెస్టు ఆఫీసర్ పరీక్షలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:00 AM
ఫారెస్టు బీట్ ఆఫీసర్, సహాయ బీట్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఆదివారం జరిగే పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అఽధికారి ఎం.వెంక టేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఫారెస్టు బీట్ ఆఫీసర్, సహాయ బీట్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఆదివారం జరిగే పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అఽధికారి ఎం.వెంక టేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని, ఫారెస్టు బీట్ ఆఫీసర్, సహాయ బీట్ ఆఫీసర్ పరీక్షలకు 5,186 మంది అభ్యర్థులు హా జరవుతారని తెలిపారు.ఉదయం పది నుంచి 12.30 గంటల వరకు ఫారెస్టు బీట్ ఆఫీసర్, సహాయ బీట్ ఆఫీసర్ పరీక్షలకు 4,495 మంది, మధ్యాహ్నం మూడు నుంచి 5.30 గంటల వరకు జరిగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు 691 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, మల్లిఖార్జునరెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.