Share News

విధుల్లో అస్వస్థతకు గురై ఆర్మీ జవాన్‌ మృతి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:26 AM

నగర సమీపంలోని బైరి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ వెంప టాపు రాజు(35) విధి నిర్వహణలో అస్వస్థతకు గురైమృతి చెందారు.

విధుల్లో అస్వస్థతకు గురై ఆర్మీ జవాన్‌ మృతి
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఇన్‌సెట్లో రాజు(ఫైల్‌)

సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర

శ్రీకాకుళం రూరల్‌, అక్టోబరు 30(ఆంరఽధజ్యోతి): నగర సమీపంలోని బైరి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ వెంప టాపు రాజు(35) విధి నిర్వహణలో అస్వస్థతకు గురైమృతి చెందారు. రాజు ఢిల్లీలో విధులు నిర్వహిస్తుండగా మంగళ వారం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే సహ చర జవాన్లు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాజు మృతదేహాన్ని గురువారం స్వగ్రామ మైన బైరి గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా రాజు మృతదే హానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది గ్రామస్థులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. రాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:26 AM