ఎరువుల కోసం వాగ్వాదం
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:41 PM
మండలంలో గల నర్సింగపల్లి సచివాయం పరిధిలో గల నర్సింగపల్లి, మొఖలింగపురం పంచాయతీల రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సివస్తోంది.
టెక్కలి రూరల్, సెప్టెంబరు 3( ఆంధ్రజ్యోతి) మండలంలో గల నర్సింగపల్లి సచివాయం పరిధిలో గల నర్సింగపల్లి, మొఖలింగపురం పంచాయతీల రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సివస్తోంది.సచివాలయానికి 30 బస్తాలు యూరియా మాత్రమే రావడంతో సరిపోకపోవడంతో రైతుల సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తక్షణమే యూరియా చెల్లాలని రైతులు చెబుతున్నారు.