Share News

రేషన్‌ డిపోల్లో వివరాల బోర్డులేవీ?

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:02 AM

రేషన్‌ డిపోల నిర్వహణ బాగులేదని, డిపోల వద్ద వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ఏమిటని రాష్ట్ర పుడ్‌కమిటీ సభ్యుడు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేషన్‌ డిపోల్లో వివరాల బోర్డులేవీ?
రణస్థలం హైస్కూల్లో ఎండీఎంను పరిశీలిస్తున్న రాష్ట్ర పుడ్‌ కమిటీ సభ్యుడు కాంతారావు

రణస్థలం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ డిపోల నిర్వహణ బాగులేదని, డిపోల వద్ద వివరా లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ఏమిటని రాష్ట్ర పుడ్‌కమిటీ సభ్యుడు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పైడిపేట, పతివాడ పాలెం, జేఆర్‌పురం రేషన్‌ డిపో లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. జేఆర్‌పురం రేషన్‌ డిపో రికార్డులను పరిశీలించగా 20 బస్తాల వరకు బియ్యం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. పతివాడపాలెం, పైడిపేట రేషన్‌డిపోల్లో రికార్డులు సక్రమంగా లేవని, రేషన్‌ డిపోల వద్ద ధరల పట్టికలు ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. సంబంధిత రేషన్‌ డిపోల డీలర్లకు మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. పిన్నింటిపేట అంగన్‌వాడీ కేంద్రం, రణస్థం జడ్పీ హైస్కూల్‌ ను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Aug 06 , 2025 | 12:02 AM